కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయి.. పవన్ కల్యాణ్ కామెంట్స్
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహిస్తున్న ప్రజా గళం సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ప్రధానికి టీడీపీ నాయకులు లోకేశ్,జనసేన బీజేపీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం ప్రజా గళం సభ వద్దకు ప్రధాని మోడీ వెళ్లారు.
దీంతో సభ వద్దకు ప్రధాని మోడీని నారా లోకేశ్ సహా బీజేపీ, జనసేన నాయకులు ఇక సభ వద్దకు మోడీ చేసుకోవడంతో ఆ ప్రాంగణమంతా జై మోడీ.. జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్ నినాదంతో సభ దద్దరిల్లింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని అన్నారు. అభివృద్ధి లేక, అవినీతి, ఆరాచక పాలనలో కొట్టమిట్టడుతొన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్నామన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని పవన్ తెలిపారు. మోదీ ముడోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.