ప్రధాని మోదీ వ్యక్తి కాదు శక్తి.. చంద్రబాబు కామెంట్స్

Byline :  Vamshi
Update: 2024-03-17 12:37 GMT

 ప్రధాని మోదీ వ్యక్తి కాదు.. భారత్ విశ్వగురుగా మారుస్తున్న శక్తి అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. బొప్పూడి ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. “మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి. మోదీ అంటే భవిష్యత్తు, ఆత్మవిశ్వాసం. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి.. మోదీ. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. మోదీ నినాదాలు" అని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ-జనసేన-బీజేపీ చిలకలూరిపేటలో ఇవాళ ప్రజాగళం సభలో బాబు మాట్లాడుతూ.. కూటమికి ప్రధాని మోడీ అండ ఉందన్నారు. ఈ సభ.. రాష్ట్ర పునర్ నిర్మాణ భరోసా సభ అని అన్నారు.

ప్రజల గుండె చప్పుడు వినిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటి అయ్యాయని తెలిపారు. ఐదు కోట్ల తెలుగు ప్రజల తరఫున ప్రగతివాది ప్రధాని మోదీకి స్వాగతం. రాష్ట్ర పునర్‌ నిర్మాణ సభ ఇది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఐదేళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు జట్టు కట్టాయి. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మా జెండాలు వేరే కావచ్చు. మా అజెండా ఒక్కటేని బాబు అన్నారు

Tags:    

Similar News