ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు పార్టీ అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తొంది. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల రిలీజ్ కావడంతో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. ఈ నెల 25న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని సమాచారం. ఇక్కడ్నుంచి వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.
సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు అధిష్టానం సీటివ్వదని పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ జగన్ మాత్రం అటు తిరిగి.. ఇటు తిరిగి అవినాశ్‌కే టికెట్ ఇచ్చారు. ఆయనపై వ్యతిరేకతతో కచ్చితంగా కాంగ్రెస్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని హైకమాండ్ గట్టి నమ్మకంతో ఉందట. షర్మిల పోటీచేస్తారన్న విషయం పక్కా అయితే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు బరిలోకి దిగినట్లు అవుతుంది.