MS Dhoni: ధోనీ అభిమానులకు షాక్.. వచ్చే ఐపీఎల్కు డౌటే!

Byline :  Bharath
Update: 2023-11-22 03:01 GMT

మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెట్ ఇచ్చి ఇన్నేళ్లైనా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. క్రికెట్ అభిమానులు ప్రతీసారి అతని పేరు తలుచుకుంటారు. అతను సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటారు. అబ్బా ఈ మ్యాచ్ లో ధోనీ ఉంటే బాగుండు. కచ్చితంగా గెలిచేవాళ్లం అని అనుకున్న సందర్భాలెన్నో. క్రికెట్ లో అంతలా తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రత్యర్థులు, పక్కదేశ అభిమానులు కూడా ధోనీ ఫ్యాన్సే. అందుకే అతను రిటైర్ అయినా ఐపీఎల్ ద్వారా ధోనీని చూసుకుంటున్నారు. అతని ఆటను ఆస్వాధిస్తున్నార. కాగా పోయిన ఐపీఎల్ సీజన్ లోనే రిటైర్మెంట్ ప్రకటిస్తారని అనుకున్నారంతా. కానీ, 2024 ఐపీఎల్ లోనూ ఆడతానని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ధోనీకి 42 ఏళ్లు. వచ్చే ఏడాదికి 43 నిండుతాయి. ఇది ధోనీ ఫిట్ నెస్ పై ప్రభావం చూపిస్తుంది. పోయిన ఐపీఎల్ లోనే రన్నింగ్ చేయడానికి, కీపింగ్ చేయడానికి ధోనీ ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. వచ్చే ఏడాది ఐపీఎల్ అంటే అది సాధ్య పడకపోవచ్చు.




 


ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే.. ధోనీ పూర్తిగా గ్రౌండ్ కు దూరంగా ఉన్నాడు. ఫిట్ నెస్ పై పట్టులేదు. ఈ పరిస్థితుల్లో మరో ఐపీఎల్ ఆడటం అంటే సాధ్యపడదనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉన్న ధోనీ.. తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్పును ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ధోనీ మెట్లు దిగేందుకు ఇబ్బంది పడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చే ఐపీఎల్ లో కెప్టెన్ కూల్ ఆటను చూడొచ్చని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. ధోనీ నడిచేందుకే ఇబ్బందిపడుతున్నారని, మరికొన్ని నెలల్లో జరిగే ఐపీఎల్ కు ఫిట్నెస్ సాధిస్తారో లేదో అని ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే పోయిన ఐపీఎలే ధోనీకి చివరిది అయినట్లు.






Tags:    

Similar News