ముఖ్యమంత్రి సలహాదారుగా సునీల్ కనుగోలు

Update: 2023-06-01 05:42 GMT

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కర్నాటక ప్రభుత్వంలో ప్రధాన్యమున్న పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం కోసం కష్టపడినందుకు సీఎం సిద్ధరామయ్య ఆయనను తన సలహాదారుగా నియమించుకున్నారు. ఇది కేబినెట్ హోదా ఉన్న పదవి. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కష్టపడిన వారందరికీ ఏదో విధంగా ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపాయి.

సునీల్ తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రాచారానికి వ్యూహాలు రచిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంపై పోలీసు దాడి చేశారు కూడా. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసి కంప్యూటర్ పరికరాలు ఎత్తుకెళ్లి ఆఫీసును సీజ్ చేశఆరు. డబ్బులిస్తే అన్ని పార్టీలకూ వ్యూహాలు రూపొందించి పెట్టే ప్రశాంత్ కిశోర్ దగ్గర పనిచేసిన సునీల్ షేర్ అనలిటిక్స్ పేరుతో సొంత దుకాణం తెరిచాడు. కాంగ్రెస్ పార్టీతోపాటు డీఎంకే, అన్నాడీఎంకే, శిరోమణి అకాలీదళ్‌లకు కూడా పని చేసిపెట్టారు. అతని స్వస్థలం కర్ణాటకలోని బళ్లారి. తండ్రి కన్నడ వ్యక్తికాగా తల్లి తెలుగు వ్యక్తి. చెన్నైలో పుట్టి పెరిగిన సునీల్ అమెరికాలో ఉన్నత చదువులు చదివారు. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సేలో పని చేశారు. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత గుజరాత్‌లో రాజకీయ వ్యూహాలలో పాలుపంచుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ (ABM)కి నాయకత్వం వహించాడు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ’40 శాతం కమిషన్’ అవినీతి ప్రధాన అస్త్రంగా వాడి కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ మార్కులు సాధించిపెట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఆయన వ్యూహాలు బాగా పనికొచ్చాయని పార్టీ అడ్వైజర్ పదవి కట్టబెట్టింది. 

Tags:    

Similar News