Chandrababu : సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం అవమానకరం : చంద్రబాబు

By :  Krishna
Update: 2024-03-03 05:26 GMT

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. అధికార - విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్లు అప్పు తెచ్చారంటూ ఓ పేపర్లో వచ్చిన వార్తపై బాబు తీవ్రంగా స్పందించారు. పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.

‘‘రాష్ట్రానికి ఎంత అవమానకరం..ఎంత బాధాకరం..ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డి. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర సీఎం కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా...అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News