కీలక మైలురాయి చేరుకున్న ఆదిత్య ఎల్ 1.. ఇప్పుడు ఎక్కడ ఉందంటే...
సూర్యుడి రహస్యాలను ఛేదిండానికి భారత్ పంపిన వ్యోమనౌక ‘ఆదిత్య ఎల్ 1’ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. భూగురుత్వాకర్షణ శక్తిని దాటిపై గమ్యం వైపు ప్రయాణిస్తోంది. ఆదిత్య ఎల్ ఎ1 భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లిపోయి గ్రావిటీ పరిధిని అధిగమించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది.
భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రేంజ్ పాయింట్ 1 వద్ద కక్ష్యలో నిలపడానికి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం తెలిసిందే. లెగ్రేంజ్ పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉండడంతో అక్కడి సూర్యుణ్ని అధ్యయనం చేయడానికి వీలుగా ఉంటుంది. ఆదిత్య ఎల్ 1ను ఈ నెల 2న శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపారు. చంద్రయాన్-3 విజయవంత కావడంతో ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రయోగం చేపట్టింది. ఆదిత్య ఎల్ 1 లో ఏడు పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి.