టీమిండియాకు గట్టి షాక్...యువ క్రికెటర్ దూరం?

Byline :  Vinitha
Update: 2024-02-20 07:54 GMT

రాంఛీ వేదికగా ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగో టెస్ట్ కు టీమిండియా సిద్దమవుతోంది. ఈ టెస్ట్ కు ముందు భారత్ కు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియా యువ సంచలనం యశస్వీ జైశ్వాల్‌ గాయం కారణంగా రాంఛీ టెస్టు దూరం కానున్నట్లు సమాచారం. భారత క్రికెటర్లకు గాయాల బెడద తప్పడం లేదు. ఈ మధ్యే గాయాల కారణంగా రాహుల్, జడేజా రెస్ట్ తీసుకున్నారు. జడేజా కొలుకోని తిరిగి మ్యాచ్ లోకి వచ్చినప్పటికీ..రాహుల్ ఇంకా రెస్ట్ లోనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం యువ సెన్సెషన్ యశస్వీ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడుతూనే జైశ్వాల్ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.

వెన్ను నొప్పి కారణంగా మూడో రోజు ఆటలో సెంచరీ తర్వాత రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగిన.. మళ్లీ నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చి రెండో డబుల్‌ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అయితే ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ఫీల్డింగ్‌ సమయంలోనూ కాస్త అసౌక్యర్యంగా కనబడ్డాడు జైశ్వాల్. ఈ క్రమంలో రాంఛీ టెస్టుకు అతనికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనెజ్మెంట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

త్వరలో టీ20 వరల్డ్‌కప్‌ వస్తుడడంతో..అతడిని రిస్క్‌ చేయకూడదని జట్టు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టులో తిరిగి అతన్ని ఆడించాలని మేనెంజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో యువ క్రికెటర్ దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ తన అరంగేట్రానికి సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు వెల్లడిస్తున్నాయి. కాగా ఇప్పటికే పలు కారణాల చేత బుమ్రా నాలుగో టెస్ట్ కు దూరం కానున్నట్లు సమాచారం.

పడిక్కల్‌ సైతం రంజీ ట్రోఫీ2023-24 సీజన్‌లో తన సత్తా చాటాడు. దీంతో అతడిని బ్యాకప్‌ ఓపెనర్‌గా సెలక్టర్లు తీసుకున్నారు. అయితే పడిక్కల్‌ ప్రస్తుతం జట్టుతో పాటే ఉన్నాడు. ఒకవేళ జైశ్వాల్‌ నాలుగో టెస్టుకు దూరమైతే భారత్‌కు నిజంగా పెద్ద షాక్ గానే చెప్పుకొవచ్చు. ఈ సిరీస్‌లో జైశ్వాల్‌ ప్రస్తుతం 545 పరుగులతో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటికే వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Tags:    

Similar News