IND vs SL: బీసీసీఐ పెద్ద మనసు.. గ్రౌండ్ స్టాఫ్కు భారీ ప్రైజ్మనీ

Byline :  Bharath
Update: 2023-09-17 15:09 GMT

ఆసియా కప్2023 ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ టోర్నీకి వరుణుడు అడ్డుపడ్డాడు. ప్రతీ మ్యాచ్ కు ఆటంకం కలిగించాడు. కొన్ని కొన్నిసార్లు గ్రౌండ్లన్నీ చెరువుల్ని తలపించాయి. అయినా మరుసటి రోజు మ్యాచ్ అదే పిచ్ పై జరిగేలా చూశారు గ్రౌండ్ స్టాఫ్, మ్యాచ్ క్యూరేటర్. ప్రతీ మ్యాచ్ కు శక్తికి మించి కష్టపడ్డారు. మ్యాచ్ లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ పెద్ద మనసు చాటుకుంది. బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్ బోర్డ్ భాగస్వామ్యంలో భారీగా ప్రైజ్ మనీని ప్రకటించారు. కొలంబో, క్యాండీ మైదానాల్లో పనిచేసిన వారికి రూ. 42లక్షలు (USD 50,000) ఇవ్వనున్నట్లు ఏసీసీ ప్రెసిడెంట్ జైషా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ స్టాఫ్ కష్టానికి తగిన ఫలింతమని మెచ్చుకుంటున్నారు.




Tags:    

Similar News