ENG vs AFG: డిఫెండింగ్ చాంపియన్స్కు షాక్.. 69 పరుగుల తేడాతో ఆఫ్గాన్ విజయం

By :  Kiran
Update: 2023-10-15 16:45 GMT

వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు ఆప్గనిస్తాన్ షాకిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ విలవిల్లాడింది. 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 40.3 ఓవర్లలోనే 215 పరుగులకు ఆలౌట్ అయింది. 69 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ ఇంగ్లండ్పై విజయం సాధించింది. మహ్మద్‌ నబీ (2/16), ముజీబుర్‌ రెహ్మన్‌ (3/51), రషీద్‌ఖాన్ (37/3) ప్రత్యర్థి జట్టును గట్టి దెబ్బకొట్టారు.

ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌ 66 (61 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) చేశాడు. డేవిడ్ మలన్ (32)స జానీ బెయిర్‌ స్టో (2), జో రూట్ (11), జోస్ బట్లర్ (9), లియామ్ లివింగ్ స్టోన్ (10), సామ్ కరన్ (10) రన్స్కే వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. ఆఖర్లో ఆదిల్ రషీద్‌ 20 (13 బాల్స్లో 2 ఫోర్లు), మార్క్‌వుడ్ 18 (22 బంతుల్లో 3 ఫోర్లు), రీస్ టాప్లీ 15* (7 బంతుల్లో 3 ఫోర్లు) రన్స్ చేసినా ఇంగ్లాండ్‌ ఓడిపోక తప్పలేదు.

అంతకు ముందు అఫ్గానిస్థాన్‌ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్‌ 80 (57 బాల్స్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) రన్స్ చేసి మెరిపించాడు. మిడిల్‌ ఆర్డర్ బ్యాటర్ ఇక్రమ్ 58 (66 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌)తో హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో ముజిబుర్ రెహ్మన్ 28 (16 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్‌ వుడ్ 2, లివింగ్‌ స్టోన్, జోరూట్, టాప్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags:    

Similar News