Afghanistan Naveen ul haq: కోహ్లీతో గొడవ.. 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఆఫ్ఘాన్ క్రికెటర్..
"ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు." 24ఏళ్లకే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. (Afghanistan bowler naveen ul haq) వరల్డ్ కప్ తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని తెలిపారు. అయితే టీ20ల ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. తన కెరీర్ను సుధీర్ఘ కాలం కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘‘వరల్డ్ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటా. వన్డేల నుంచి తప్పకున్నా టీ20ల్లో కొనసాగుతా. నా కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా దేశానికి ప్రాతినథ్యం వహించే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. నాకు అన్ని విధాల సహకరించిన అఫ్గాన్ క్రికెట్ బోర్డు, అభిమానులకు ధన్యవాదాలు’’ అని నవీన్ ఉల్ హక్ ప్రకటించాడు.
నవీన్ ఉల్ హక్ ఐపీఎల్ టోర్నీలో విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత పాపులర్ అయ్యాడు. అప్పటివరకు అతడు ఎవరికి పెద్దగా తెలియదు. కోహ్లీ ఫ్యాన్స్ అయితే నవీన్ ఉల్ హక్ను సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకున్నారు. అతడు కూడా వెనక్కి తగ్గకుండా ఘాటు రిప్లై ఇచ్చారు. కాగా ఈ వరల్డ్ కప్ కు నవీన్ ను అఫ్ఘాన్ మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు. ఇప్పటికే కేవలం 7వన్డేలు మాత్రమే ఆడిన నవీన్.. 14వికెట్లు మాత్రమే తీశాడు.