వరల్డ్ కప్లో ఆఫ్గానిస్తాన్ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్గనిస్తాన్ 7వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 181 రన్స్ టార్గెట్ ను 31.3 ఓవర్లలోనే చేధించింది. రహమత్ షా 52 , హష్మతుల్లా షాహిదీ 56 తో రాణించారు. ఈ మ్యాచ్లో గెలుపుతో ఆఫ్గాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకు 7మ్యాచులు ఆడిన ఆఫ్గాన్.. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ పై విక్టరీ కొట్టింది. ఇంకో రెండు మ్యాచులు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో ఆడాల్సివుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ ఆఫ్లాన్ బౌలర్ల దెబ్బకు తక్కువ స్కోర్కే కుప్పకూలింది. 43.3 ఓవర్లలో 179 రన్స్ మాత్రమే చేసింది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 58, మాక్స్ ఓ డౌడ్ 42 రన్స్తో రాణించగా.. మిగితా బ్యాట్స్మెన్స్లో అకెర్మాన్ 29 తప్ప ఇంకెవరూ 20 రన్స్ దాటలేదు. ముగ్గురు బ్యాటర్లు రనౌట్ కావడం గమనార్హం. ఆప్గాన్ బౌలర్లలో నబీ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్ 2, ముజీబ్ ఒక వికెట్ తీశారు.