SL vs AFG: రషిద్ ఖాన్కు గుర్తుండిపోయే మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
పూణే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ లో గెలుపు అవసరం. దీంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. అంతేకాకుండా ఈ రెండు జట్లు పెద్ద జట్లను ముప్పుతిప్పలు పెట్టాయి. ఓడించినంత పనిచేశాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు 5 మ్యాచ్ లు ఆడగా.. మూడిట్లో ఓడిపోయి రెండు మ్యాచుల్లో గెలిచింది. పాయింట్స్ టేబుల్ లో శ్రీలంక 5వ స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్ 7వ స్థానంలో ఉంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండగా.. 300 పరుగులు వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్ చెప్తుంది. కాగా ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ బౌలర్ రషిద్ ఖాన్ కు వన్డేల్లో 100వ మ్యాచ్ కావడం విశేషం.
తుది జట్లు:
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(w), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హా
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ (w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక