AUS vs SA: టీమిండియాను ఢీకొట్టేదెవరు.. సౌతాఫ్రికాపై ఉన్న చోకర్స్ ముద్ర చెరిగేనా!

By :  Bharath
Update: 2023-11-16 05:07 GMT

ఐదుసార్లు చాంపియన్‌‌ ఓవైపు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నాలుగుసార్లు సెమీస్‌‌ చేరి ఓడిన జట్టు మరోవైపు. మెగా టోర్నీల్లో ఒకరిదేమో తిరుగులేని ఆధిపత్యం.. నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒత్తిడిని జయించలేని పరిస్థితి మరికొరిది. బలాబలాల్లో ఇరుజట్లూ సమవుజ్జీలే అయినా.. ఒత్తిడిని జయించడంలో ఇరు జట్లకు ఎంతో తేడా ఉంది. వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ లో ఇవాళ (నవంబర్ 16) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కీలక పోరుకు రెడీ అయ్యాయి. నాలుగుసార్లు సెమీస్‌ చేరినా.. ఫైనల్లో అడుగుపెట్టని సఫారీలు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడిన కంగారూలు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గెలుపుతో 8వసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. కాగా చివరిసారిగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు 1999లో సెమీస్ లో తలపడ్డాయి. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇరు జట్లు మళ్లీ సెమీస్ లో తలపడుతున్నాయి.

సౌతాఫ్రికా లీగ్‌ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి ఏకంగా రెండో స్థానంలో నిలిచి సెమీస్‌ బెర్త్‌ను పట్టేసింది. టోర్నీ మొత్తంలో ఓపెనర్‌ డికాక్‌ పరుగుల వరద పారిస్తుండగా.. డుస్సెన్‌, మార్‌క్రమ్‌, క్లాసెన్‌ చెలరేగి పోయారు. అయితే గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ బవుమా ఈ మ్యాచ్ లో ఆడేది అనుమానమే. ఇక బౌలింగ్‌లో పేసర్లు రబాడ, ఎన్‌గిడి ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నారు. స్పిన్నర్‌ కేశవ్‌తోపాటు ఆల్‌రౌండర్‌ కొట్జీ మ్యాచ్‌ విన్నర్లుగా మారారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వరుసగా సెంచరీలు కొట్టిన ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటం ఆస్ట్రేలియాకు అతిపెద్ద బలం. కీలక మ్యాచ్ లో ఓడిపోయే మ్యాచ్ ను సింగిల్ హ్యాండ్ తో గెలిపించి మ్యాక్స్ వెల్ కూడా ప్రమాదమే. 

Tags:    

Similar News