షోయ‌బ్ మాలిక్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. కాంట్రాక్ట్ క్యాన్సిల్

By :  Bharath
Update: 2024-01-26 08:52 GMT

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చూన్ బరిషల్ జట్టు తరపున ఆడుతున్న అతడు. ఇటీవల ఓ మ్యాచ్‌లో ఓకే ఓవర్లో వరుసగా మూడు నో బాల్స్ వేశారు. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో షాయబ్‌తో ఒప్పందాన్ని బరిషల్ జట్టు రద్దు చేసుకుంది. జ‌న‌వ‌రి 22న సోమ‌వారం ఫార్చూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఖుల్నా టైగ‌ర్స్ ల‌క్ష్యాన్ని ఛేదిస్తున్న క్ర‌మంలో ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌ను షోయ‌బ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో అత‌డు వ‌రుస‌గా మూడు నోబాల్స్ వేశాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 18 ప‌రుగులు వ‌చ్చాయి. సాధార‌ణంగా స్పిన్న‌ర్లు నోబాల్స్ అనేవి చాలా అరుదుగా వేస్తుంటారు.

అలాందిటి షోయ‌బ్ ఒకే ఓవ‌ర్‌లో మూడు నోబాల్స్ వేయ‌డం అనేది అనేక అనుమానాల‌కు తావు ఇచ్చింది. దీంతో అత‌డిపై అభిమానులు నెట్టింట‌ మండిప‌డుతున్నారు. బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సయ్యద్ సమీ, ఫార్చ్యూన్ బరిషల్ జట్టు యజమాని మిజానూర్ రెహ్మాన్‌ను ఉటంకిస్తూ.. “ఫిక్సింగ్” అనుమానంతో ఫ్రాంచైజీ షోయబ్ మాలిక్ ఒప్పందాన్ని రద్దు చేసిందని పేర్కొన్నారు.కాగా.. ఈ మ్యాచ్ అనంత‌రం ఇక పై బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడకూడదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ గురువారం ధృవీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల మాలిక్ దుబాయ్ వెళ్లాడ‌ని మిగిలిన మ్యాచుల‌కు అందుబాటులో ఉండ‌డ‌ని ఫార్చ్యూన్ బరిషల్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అనంత‌రం అత‌డిపై వేటు వేసింది. అతని స్థానంలో అహ్మద్ షెహజాద్‌ని ఫ్రాంచైజీ తీసుకుంది.


Tags:    

Similar News