IPL Auction 2024: శివమ్ మావీ జాక్ పాట్.. భారీ ధరకు అల్జారీ జోసెఫ్
రెండు రౌండ్లలో ఆటగాళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపని ఆర్సీబీ.. రెండో సెట్ లో తన ఆట మొదలుపెట్టింది. ముఖ్యంగా బౌలర్లను టార్గెట్ చేసిన ఆర్సీబీ ఫ్రాంచైజీ.. వెస్టిండీస్ బౌలర్ అల్జరీ జోసెఫ్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కోటి రూపాయల బేస్ ప్రైజ్ తో వేలంలో పాల్గొన్న జోసెఫ్ కోసం.. చెన్నై, ఆర్సీబీ, ఢిల్లీల మధ్య తీవ్ర పోటీ జరగగా.. రూ.11.5 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. కాగా టీమిండియా యువ బౌలర్ శివమ్ మావీ జాక్ పాట్ కొట్టాడు. రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ తో వేలంలో పాల్గొన్న మావీని లక్నో రూ.6.4 కోట్లకు కొనుగోలు చేసింది.
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ కు ఆశించినంత ధర పలకలేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలో పాల్గొన్న ఉమేష్ ను గుజరాత్ టైటాన్స్ రూ.5.8 కోట్లకు కొనుగోలు చేసింది. కేఎస్ భరత్ కూడా తక్కువ ధరకే అమ్ముడు పోయాడు. రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ ను ఢిల్లీ, చేతను సకారియాను కోల్ కతా రూ.50 లక్షల బేస్ ప్రైజ్ కు కొనుగోలు చేశాయి.