వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమికి అదే కారణం : రాయుడు

By :  Krishna
Update: 2023-11-27 01:41 GMT

వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపై అంబటి రాయుడు స్పందించాడు. పిచ్ స్లోగా ఉండటమే ఓటమికి కారణమని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ పిచ్ను ప్రణాళిక ప్రకారమే ఇలా చేసి ఉంటే అతి తెలివి తక్కువ తనమే అవుతుందన్నారు. ‘‘వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ఆడిన పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. పిచ్ ఇలా తయారు చేయాలన్న ఆలోచన ఎవరిదో నాకు తెలియదు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే పిచ్ తయారు చేయాల్సింది. ఎందుకంటే ఆసిస్‌తో పోలిస్తే భారత్ చాలా బలంగా ఉంది. కానీ తుది పోరులో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు’’ అని రాయుడు అన్నారు.

భారత్‌కు ఏ జట్టునైనా ఓడించగలిగే సత్తా ఉందని రాయుడు అన్నారు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో పిచ్ తొలి నుంచి చివరి దాకా ఒకేవిధంగా ఉండటమే బెటర్ అని అభిప్రాయపడ్డారు. టాస్‌కు ప్రాధాన్యం ఉండకూడదని అన్నారు. కాగా వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘోర ఓటమిపాలైంది. టోర్నీలో అపజయం ఎరుగని టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో ఆసీస్ ఆరోసారి కప్ కొట్టింది.

Tags:    

Similar News