ఎంతో మంది తొక్కేయాలని చూశారు.. చివరికి అదే జరిగింది - అంబటి రాయుడు

Update: 2023-06-01 14:17 GMT

ఇండియన్ క్రికెట్ టీంలో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరంటే.. అది తెలుగు తేజం అంబటి రాయుడే. తన తోటి ఆటగాళ్లు టీమిండియాకు సెలక్ట్ అవుతున్నా.. తన జూనియర్స్ కు ఛాన్స్ లు ఇస్తున్నా తనెప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. క్రికెట్ లో వేసిన తొలి అడుగు నుంచి తొక్కేయని ప్రయత్నించిన వాళ్లకు.. తన ఆటతో సమాధానం ఇచ్చాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఆటపై తనదైన ముద్ర వేశాడు.

అయితే, తన 30 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి ఎంత చేయాలో అంత చేశాడు. అయినా.. కొన్ని రాజకీయాల వల్ల ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. అండర్ 19 కెప్టెన్ గా, టీమిండియా ఆటగాడిగా, ఐపీఎల్ లో కీలక ప్లేయర్ గా తన పాత్రకు న్యాయం చేశాడు. ఐపీఎల్ లో ఎక్కువ ట్రోఫీలు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. తన చివరి ఐపీఎల్ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదో ట్రోఫీని అందించాడు.

క్రికెట్ లో తనను చాలామంది తొక్కెయాలని చూశారు. ఆ విషయం తెలిసినా రాయుడు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సెలక్టర్లలో, ఆటగాళ్లలో తనపై కుట్రలు చేసి.. గేమ్ లో ఎదగకుండ చేసినా ఎప్పుడూ రాజీ పడలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియా వరకు వెళ్లాడు. అయితే, ఇన్ని అడ్డంకులు దాటి ఓ బెస్ట్ క్రికెటర్ గా ఎదగడంపై రాయుడు ‘నాకు గేమ్ ఉన్న కమిట్మెంట్ అలాంటిది. నేను నాపై నమ్మకం ఉంచా. రికమండేషన్స్ నమ్ముకుంటే మంచి ఆటగాళ్లు కాలేరు. నీ ఆటపై నమ్మకం ఉంటే.. ఎవరూ ఆపలేరు. నిన్ను తొక్కేయాలనుకునే వాళ్లకు ఆటతోనే సమాధానం చెప్పాలి’ అని అంటాడు.

Tags:    

Similar News