World cup final: వీరులారా.. విజయీభవ.. భారత టీంలో మార్పు?

By :  Bharath
Update: 2023-11-19 07:05 GMT

కోట్ల మంది ప్రజల ఆశలు మోస్తూ.. వరల్డ్ కప్ మొత్తంలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో ఈ మహా సంగ్రామంలో తలపడనుంది. ప్రపంచకప్‌లో మన ఆధిపత్యాన్ని చరితగా చెప్పుకోవాలన్నా.. లీగ్ స్టేజ్ లో ఇప్పటివరకూ సాధించిన ఆ పది విజయాలకు విలువ ఉండాలన్నా.. ఇంకో ఒక్క అడుగు దూరంలో ఉన్న అంతిమ విజయాన్ని సాధించి తీరాలి. పటిష్ఠమైన ఆస్ట్రేలియాను చిత్తుచేసి.. 2003 ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ.. అప్పటి కన్నీళ్లకు బదులిస్తూ.. ఈసారి కప్పు పట్టాలన్నదే అందరి కోరిక. 1.30 లక్షల ప్రేక్షకుల కేరింతల నడుమ.. సమవుజ్జీని కొట్టి సగర్వంగా ట్రోఫీని ముద్దాడాలని ఆశ. ఇదంతా జరగడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.

కాగా ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా జట్టులో మార్పు చేసే అవకాశం ఉందనే వార్త వినిపిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో అశ్విన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అశ్విన్ లోయర్ మిడిలార్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే సూర్య స్థానంలో అశ్విన్ ను తీసుకునే అవకాశం ఉంది. అయితే విన్నింగ్ టీం కాంబినేషన్ మార్చే అవకాశం లేదని.. కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆసీస్ పై అశ్విన్ కు రికార్డులు ఉన్నాయి. వార్నర్, స్మిత్, లబుషేన్ లాంటి ప్లేయర్లు కూడా అశ్విన్ స్పిన్ ను ఎదుర్కునేందుకు ఇబ్బంది పడుతుంటారు.

Tags:    

Similar News