Asia Cup 2023 : ఎప్పుడైనా చూశారా.. చరిత్రలో ఇదే మొదటిసారంట!

Update: 2023-08-11 10:15 GMT

ఆసియా కప్ కు రంగం సిద్ధం అయింది. భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే ఆ ఉత్కంట పోరుకు ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈసారి ఆసియా కప్ కు పాక్ ఆతిథ్యం ఇస్తుండగా.. భారత్ ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలో జరుగనున్నాయి. ఇంకా 22 రోజుల్లో (సెప్టెంబర్ 2) శ్రీలంక గడ్డపై దయాది దేశాలు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఓ వార్త భారత అభిమానుల్ని కలవర పెడుతుంది. పాక్ జట్టంటే మండిపడే అభిమానులు తేరుకోలేకపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రతీ రెండేళ్లకొకసారి జరిగే ఆసియా కప్ కు ఈసారి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అందులో భాగంగానే హోస్టింగ్ కంట్రీ పేరు టోర్నీ లోగో కింద ముంద్రిస్తారు. ఆ లోగో టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జెర్సీపై ఉంటుంది. దాంతో టీమిండియా జెర్సీపై కూడా పాకిస్తాన్ పేరు అచ్చయింది. ఆ జెర్సీలను వేసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దాంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఏదేమైనా టీమిండియా జెర్సీపై పాక్ పేరు ఉండటం ఇదే మొదటిసారట. గతంలో పాక్ టోర్నీ నిర్వహించినా.. అప్పుడు జెర్సీపై హోస్టింగ్ కంట్రీ పేరు అచ్చు వేయలేదు.

ఆసియా కప్ షెడ్యూల్2023:

ఆసియా కప్ 2023 షెడ్యూల్

ఆగస్టు 30: పాకిస్థాన్ vs నేపాల్ (ముల్తాన్)

ఆగస్టు 31: బంగ్లాదేశ్ vs శ్రీలంక (క్యాండీ)

సెప్టెంబర్ 2: ఇండియా vs పాకిస్తాన్ (క్యాండీ)

సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)

సెప్టెంబర్ 4: ఇండియా vs నేపాల్ (క్యాండీ)

సెప్టెంబర్ 5: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)

సూపర్ 4:

సెప్టెంబర్ 6: A1 vs B2 (లాహోర్)

సెప్టెంబర్ 9: B1 vs B2 (కొలంబో)

సెప్టెంబర్ 10: A1 vs A2 (కొలంబో)

సెప్టెంబర్ 12: A2 vs B1 (కొలంబో)

సెప్టెంబర్ 14: A1 vs B1 (కొలంబో)

సెప్టెంబర్ 15: A2 vs B2 (కొలంబో)

సెప్టెంబర్ 17: ఫైనల్ (కొలంబో)

Tags:    

Similar News