ఆసియా కప్ షెడ్యూల్ విడుదల..ఎప్పటినుంచంటే..

Update: 2023-06-15 12:26 GMT

ఎన్నో చర్చల అనంతరం ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైంది. ఆసియా కప్​ నిర్వహణ విషయంలో పాకిస్థాన్​ ప్రతిపాదించిన హైబ్రిడ్​ మోడల్​కే ఆసియా క్రికెట్​ మండలి (ఏసీసీ) మొగ్గుచూపడంతో టోర్నీ నిర్వాణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఆసియా కప్‌-2023 షెడ్యూల్‌ ఖరార్ చేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 17 వరకు ఆసియా కప్ జరగనుంది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగనుండగా.. శ్రీలంకలో మిగిలిన 9 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

మొత్తం 13 వన్డే మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు పాల్గొంటాయి. టోర్నమెంట్‌లో ఈ ఏడాది మూడు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి, మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. సూపర్ ఫోర్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 17న ఫైనల్‌లో తలపడతారు. భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌లు ఒక గ్రూపులో ఉండగా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మరో గ్రూపులో ఉన్నాయి.ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన న ACC పురుషుల ప్రీమియర్ కప్ ఫైనల్‌లో UAEని ఓడించి ఆసియాకప్‌‌కు నేపాల్ అర్హత సాధించింది.


Tags:    

Similar News