Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌ హవా.. తొలిరోజే పతకాల వెల్లువ

Byline :  Veerendra Prasad
Update: 2023-09-24 04:53 GMT

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ వరుసగా పతకాలను తన ఖాతాలో వేసుకుంటున్నది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌, లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో సిల్వర్‌ మెడల్స్‌ సొంతం చేసుకున్న భారత్... రోయింగ్‌లో (Rowing) మరో పతకాన్నిసాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌ (Air Rifle Team event)లో ఇండియాకు తొలి పతకం లభించింది. రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన మహిళల జట్టు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతకం సాధించింది. చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్‌ మెడల్‌ సాధించగా, 1886 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్యా పతకం గెలుచుకున్నది.




 


ఇక లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో (Lightweight Double Sculls) భారత్ రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నది. అరవింద్‌ సింగ్ (Arvind Singh)‌, అర్జున్‌ జత్‌ లాల్‌ (Arjun Jat Lal)తో కూడిన జట్టు స్కల్స్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం (Silver medal) గెలుపొందారు.




 


రోయింగ్‌ మెన్స్‌ పెయిర్‌ ఈవెంట్‌లో (Men’s Pair event) బాబు యాదవ్ (Babu Lal Yadav)‌, లేఖ్‌ రామ్‌తో (Lekh Ram) కూడిన జట్టు కాంస్య (Bronze) పతకం గెలుపొందింది. ఈ ఈవెంట్‌లో హాంగ్‌కాంగ్‌ జట్టు 6.44 నిమిషాల్లో నిర్ధేశిత గమ్యాన్ని చేరుకుని మొదటి స్థానంలో (బంగారు పతకం) నిలువగా, 6.48 నిమిషాలతో ఉబ్జెకిస్థాన్‌ (రజతం), 6.50 నిమిషాలతో భారత జంట మూడో స్థానం (కాంస్యం)లో నిలిచారు.




 





Tags:    

Similar News