క్రికెట్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన భారత అభిమానులు చేసే రచ్చ మామూలిది కాదు. నినాదాలు, ప్లకార్డులతో హోరెత్తిస్తారు. వాళ్ల హుషారుతో ఆటగాళ్లలో జోష్ నింపి మ్యాచ్ ను మలుపుతిప్పిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఇక్కడో విచిత్రం జరిగింది. మ్యాచ్ లో భారత్ కు సపోర్ట్ ఇస్తూ భారత్ మాతాకీ జై అని నినాదాలు చేయడం కామన్. ఇతర దేశాల అభిమానులు కూడా మన అభిమానులతో కలిసిపోయి భారత్ కు సపోర్ట్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ అక్కడే ఓ విచిత్రం జరిగింది. టీమిండియా అభిమాని కొంటె పనికి ఓ కొత్త నినాదం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అక్టోబర్ 28న ధర్మశాల వేదికపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు భారత్ అభిమానులు కూడా హజరై.. తమ సపోర్ట్ ను అందించారు. అదే సమయంలో భారత్ మాతాకీ జై, జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. మన ఫ్యాన్స్ తో పాటు అవే జోష్ ను కొనసాగించిన ఓ ఆసీస్ అభిమాని కూడా నినాదాలు చేశాడు. జై సియా రామ్ అంటూ ప్రేక్షకుల్లో ఊపు తెచ్చాడు. అదే ఊపులో ఓ భారత అభిమాని ‘ఆస్ట్రేలియా మాతాకి జై’ అంటూ నినాదాలు చేశాడు. దాంతో ఆ ఆసీస్ అభిమాని అదే జపం చేశాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు.
The world I want to see….😀 pic.twitter.com/kBpSES9Gjr
— Harsh Goenka (@hvgoenka) October 30, 2023