వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తక్కువ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 240 రన్స్కు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ 66, కోహ్లీ 54, రోహిత్ 47 రన్స్తో రాణించారు. మిగితా బ్యాట్స్మెన్స్లలో ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అయితే భారత బ్యాటర్లపై ఆసీస్ బౌలర్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి పిచ్పై ఆడటం అంత ఈజీ కాదన్నారు. కానీ కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ బాగా ఆడారని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ బౌలర్లపైనే ఉంది. షమీ, బుమ్రా రాణిస్తే ఇండియా గెలవడం ఖాయం.