Australia vs West Indies : వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. తొలి టెస్టు లో ఘన విజయం
ఆస్ట్రేలియా సొంత గడ్డపై ఘనం విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీసులో భాగంగా తొలి టెస్టు లో వెస్టిండీస్‌ను ఆసీస్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వెస్టిండీస్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో 188 &120 పరుగులు చేసింది. ఆసీస్ 283 & 26/0 తో వికెట్ పడకుండా లక్ష్యాన్ని చేధిస్తుంది. ట్రావిస్ హెడ్ (119) అజేయంగా సెంచరీ చేశాడు. రెండో టెస్ట్ జనవరి 22న ప్రారంభం అవుతుంది. హాజిల్‌వుడ్ దాటికి ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. అయితే కఠినమైన పిచ్‌పై సెంచరీ చేసిన హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 188 పరుగులకే ఆలౌట్ అయింది. జోష్ హాజిల్‌వుడ్ (4/44), ప్యాట్ కమిన్స్ (4/41) దాటికి విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. కిర్క్ మెక్‌కెంజీ (50) టాప్ స్కోరర్. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) చేయడం విశేషం. బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరశపర్చారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 283 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ సెంచరీ చేశాడు. షమార్ జోసఫ్ (5/94) ఐదు వికెట్స్ పడగొట్టాడు.