మాక్స్వెల్ విధ్వంసం.. నెదర్లాండ్స్పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ..

By :  Krishna
Update: 2023-10-25 15:57 GMT

వరల్డ్ కప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. పసికూనపై 309రన్స్ తేడాతో గెలిచింది. ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. 400 టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. 90 రన్స్కే ఆలౌట్ అయ్యింది. విక్రమ్‌జిత్ సింగ్ ఒక్కడే 25 రన్స్ చేయగా... మిగితా బ్యాట్స్ మెన్స్ అందరూ 20లోపే ఔట్ అయ్యారు. ముగ్గురు బ్యాట్స్మెన్స్ డగౌట్ కాగా.. మరో ఇద్దరు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 4 వికెట్లు తీయగా..మార్ష్ 2, స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు ఆసీస్ బ్యాటర్లు నెదర్లాండ్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. డేవిడ్ వార్నర్, మాక్స్ వెల్ సెంచరీలతో హోరెత్తించారు. వార్నర్కు వరుసగా ఇది రెండో సెంచరీ కాగా.. మాక్స్వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. వార్నర్ ముందు నుంచే దూకూడుగా ఆడాడు. ఓపెనర్ మార్ష్ 9పరుగులకే ఔట్ అయినా.. స్మిత్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరద్దరూ కలిసి 132 రన్స్తో కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ఇక 71 రన్స్ వద్ద స్మిత్ ఔట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన లాబుస్చాగ్నే కూడా హాఫ్ సెంచరితో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్యాటింగ్కు వచ్చిన మాక్స్ వెల్ విధ్వంసం సృష్టించాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఉతికారేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మాక్స్ వెల్.. 40 బాల్స్ లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. మాక్స్ వెల్ విధ్వంసంతో ఆసీస్ 399 స్కోర్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్4, బాస్ డి లీడే 2, ఆర్యన్ దత్ ఒక వికెట్ పడగొట్టారు.


Tags:    

Similar News