రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. 66 రన్స్ తేడాతో రోహిత్ సేనను ఓడించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 352 రన్స్ చేసింది. మిచెల్ మార్ష్ (96) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. డేవిడ్ వార్నర్ (56), స్టీవ్ స్మిత్ (74), లబుషేన్ (72) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్‌దీప్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఫస్ట్ వికెట్కు 74 రన్స్ జోడించారు. ఆ తర్వాత సుందర్ అవుట్ అవ్వగా.. కోహ్లీతో కలిసి రోహిత్ ధాటిగా ఆడాడు. అయితే 81 రన్స్ వద్ద మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 56 రన్స్ చేసిన విరాట్ ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 48 రన్స్, జడేజా 35 రన్స్ చేయగా.. మిగితా ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. దీంతో 286 రన్స్కు టీమిండియా ఆలౌట్ అయ్యింది. కాగా ట్రై సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచిన టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది.