Australia Won The ICC World Cup 2023 : ఆరోసారి కప్ కొట్టిన ఆసీస్.. ఇండియాపై ఘనవిజయం
కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. భారత్పై 7వికెట్ల తేడాతో గెలిపొంది ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 రన్స్ మాత్రమే చేసింది. 241 టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ముందు నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్గా వచ్చిన హెడ్ సెంచరీతో చెలరేగాడు. 47 రన్స్కే 3వికెట్లు కోల్పోయినా.. హెడ్ (137), మార్నస్ లాబుస్చాగ్నే(58) నిలకడగా ఆడి తమ జట్టుకు ట్రోపీని అందించారు.
అంతకుముందు టీమిండియా బ్యాటింగ్లో తడబడింది. 50 ఓవర్లలో 240 రన్స్కు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ 66, కోహ్లీ 54,రోహిత్ 47 రన్స్తో రాణించినా.. మిగితా బ్యాట్స్మెన్స్లలో ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో భారత్ తక్కువ స్కోర్కే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. జోష్ హాజిల్‌వుడ్ 2,పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశారు.