New Zealand vs Australia : రెండో టీ20లో కివీస్‌పై ఆసీస్ ఘన విజయం..సిరీస్ కైవసం
న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో టీ20లో 72 పరుగులతో తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ 45 రన్స్‌తో రాణించాడు. లక్ష్య ఛేదనలో కీవిస్ 102 పరుగులకే కుప్పకూలింది. జంపా 4, ఎల్లిస్ 2 వికెట్లతో చెలరేగారు. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆక్లాండలోని ఈడెన్ పార్క్‌లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమయ్యారు.
కంగారూ టీమ్‌లో హెడ్(45), ప్యాట్ కమిన్స్(28), కెప్టెన్ మిచెల్ మార్ష్(26)లు మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ నాలుగు, మిల్నే, శాంట్నర్‌లు తలా రెండేసి వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో కివిప్ అదినుంచి తడబడింది. ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఒక్కడే(42) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో ట్రెంట్ బౌల్ట్(16), జోష్ క్లార్క్‌సన్(10)లు కాసేపు పోరాడినా సరిపోలేదు. ఆడం జంపా నాలుగు వికెట్లు తీయడంతో కివీస్ 17 ఓవర్లలోపే ఆలౌటయ్యింది. వరుసగా రెండో ఓటమితో సిరీస్ చేజార్చుకుంది. నామమాత్రమైన మూడో టీ20 ఫిబ్రవరి 25వ తేదీన జరుగనుంది.