Fastest century: చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్.. డెవిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ బద్దలు

Byline :  Bharath
Update: 2023-10-08 10:47 GMT

వన్డేల్లో వేగవంతమైన సెంచనీ నమోదయింది. 21 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఈ ఘనత సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆసీస్ దేశవాలీ వన్డే టోర్నీ మార్ష్ కప్ 2023-24లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డ్ నమోదయింది. టస్మాలియా ఆదివారం (అక్టోబర్ 8) టస్మానియాతో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడిన ఫ్రేజర్.. 29 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్.. 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. దీంతో లిస్ట్ ఏలో డివిలియర్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ ను ఫ్రేజర్ బద్దలుకొట్టాడు. 2014లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ 31 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇవాళ ఫ్రేజర్ ఆడిన ఇన్నింగ్స్ తో 10 ఏళ్లుగా చలామణిలో ఉన్న ఆ రికార్డ్ బద్దలయింది.




 







Tags:    

Similar News