BAN vs NED: ఘోర ఓటమి.. చెప్పుతో కొట్టుకున్న అభిమాని

By :  Bharath
Update: 2023-10-29 14:58 GMT

వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ జట్టు పెద్ద టీంలకు షాక్ ఇస్తుంది. మొన్న ఇంగ్లాండ్, నిన్న బంగ్లాదేశ్ లపై ఘన విజయం సాధించి.. అందరికీ షాక్ ఇచ్చింది. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న జట్టు చేతిలో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్లేయర్ల ఆటతీరును తిడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఆ దేశ అభిమానుల నుంచి అలాంటి నిరసనే ఎదురైంది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లపై ఓ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పుతో కొట్టుకున్నాడు. ‘మీరు పెద్ద జట్లపై ఓడిపోవడాన్ని మేమేం (ఫ్యాన్స్) పట్టించుకోం. కానీ నెదర్లాండ్స్ లాంటి చిన్న టీం చేతిలో ఎలా ఓడిపోతారు? మా ప్లేయర్లను చెప్పుతో కొట్టాలి. కానీ వారి బదులు నేనే కొట్టుకుంటున్నా’ అంటూ తన చెంపలపై చెప్పుతో కొట్టుకున్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా శనివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 229 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయి పరువు పోగొట్టుకుంది. దీంతో బంగ్లా అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. మెగా టోర్నీల్లో ఎప్పుడూ తమ జట్టు గొప్ప ప్రదర్శన చేయదని, ప్రతీసారి ఫెయిల్ అవుతుందని మండిపడుతున్నారు.

Tags:    

Similar News