BAN vs NED: స్వల్ప టార్గెట్ ఇచ్చినా.. తడబడుతున్న బంగ్లా

By :  Bharath
Update: 2023-10-28 15:08 GMT

ఈ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ జట్టు సంచలనాలకు కేరాఫ్ గా మారింది. అద్భుత ఆట తీరుతో హేమాహేమీ జట్లను మట్టి కరిపిస్తుంది. ప్రతీ జట్టుకు గట్టి పోటీ ఇస్తూ భయపెడుతుంది. ఈ క్రమంలో కోల్ కతా లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాణిస్తుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. కెప్టెన్ ఎడ్వర్డ్స్ (68), బర్రెసి (41), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35) రాణించారు. బంగ్లా బౌలర్లు ఇస్లామ్, తస్కిన్, ముస్తాఫిజుర్, మెహది హసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. షకిబల్ హసన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

నెదర్లాండ్స్ నిర్దేశించిన 230 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తడబడుతోంది. 25 ఓవర్లలో 87 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లిటన్ దాస్ (3), హసన్ (15), మెహిదీ (35), షాంటో (9), షకీబ్ (5), ముస్తాఫిజుర్ రహిమ్ (1) ఫెయిల్ అయ్యారు. దీంతో బంగ్లా ఓటమి దాదాపు ఖారారయింది. మరో సంచలన విజయాన్ని నమోదు చేయడానికి నెదర్లాండ్స్ ఇంకా 4 వికెట్లు మాత్రమే అవసరం అయ్యాయి. నెదర్లాండ్స్ బౌలర్లలో కోలిన్ అకెర్మాన్ 3 వికెట్లు పడగొట్టగా.. బాస్ డి లీడే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్ చెరో వికెట్ తీసుకున్నారు. గెలుపు కోసం బంగ్లా మిగిలిన 25 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేయాలి. క్రీజులో ఆల్ రౌండర్లు మహ్మదుల్లా (16), మెహెదీ హసన్ (7) ఉన్నారు.



Tags:    

Similar News