ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

Update: 2023-07-11 13:35 GMT

బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ మహిళల జట్టు అదరగొట్టింది.వరుసగా రెండో టీ20లోను విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన రెండవ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 95 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బంగ్లాదేశ్ 87 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 95 పరుగులే చేసింది. టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 19 పరుగులు చేసిన షెఫాలీ వర్మ టాప్‌ స్కోరర్‌. స్మృతి మంధాన (13), యస్తికా భాటియా (11), దీప్తి శర్మ (10) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా 3, ఫాహిమా 2 వికెట్లు పడగొట్టారు.

96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను భారత్ బౌలర్లు 87 పరుగులకు ఆలౌట్‌ చేశారు. బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తాన్(38) మినహా అంతా విఫలమయ్యారు. దీప్తి శర్మ (3/12), షెఫాలీ వర్మ (3/15), మిన్ను మణి (9/2) చెలరేగడంతో.. భారత్‌ స్వల్ప లక్ష్యాన్ని నిలబెట్టుకుంది.

చివరిలో ఉత్కంఠ

చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 10 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అయితే షెఫాలీ వర్మ మూడు వికెట్లు తీయడంతో పాటు ఓ రనౌట్ రూపంలో నాలుగు వికెట్లు దక్కాయి. కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది. ఇక నామమాత్రపు మూడో వన్డే టీ20 జులై 13న జరగనుంది.

Tags:    

Similar News