వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలిచింది. నిజామ్ ఉల్ హుస్సేన్ 90 (101 బంతుల్లో 12 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (65 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 82 పరుగులు చేశారు. 41.1 ఓవర్లలోనే బంగ్లాదేశ్ టార్గెట్ పూర్తి చేసింది. శ్రీలంక బౌలర్లలో మధుశంక 3 వికెట్లు పడగొట్టగా, మహీశ్ తీక్షణ, మ్యాథ్యూస్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది.
279 పరుగుల ఛేదనలో బంగ్లా ఓపెనర్లు తాంజిద్ హసన్(9), లిట్టన్ దాస్(23) త్వరగానే ఔటైనా.. నజముల్ హుస్సేన్ శాంటో(90)- షకీబ్(82) జోడి మూడో వికెట్‌కు ఏకంగా 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో వీరిద్దరూ వెనుదిరిగిన మహ్మదుల్లా(22), ముష్ఫికర్ రహీం(10), తౌహిద్ హృదయ్ (15 నాటౌట్) తలో చేయి వేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.