India vs England : ఇంగ్లాండ్తో టెస్టులు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
(India vs England) ఇంగ్లాండ్తో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు టెస్టులు జరగ్గా.. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ క్రమంలో మిగితా మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ మిగితా మూడు టెస్టులకు దూరమయ్యాడు. జడేజా, కేఎల్ రాహుల్ గాయపడగా.. వారి ఫిట్ నెస్ను బట్టి తుది జట్టులోకి ఎంపిక చేస్తారు. ఫామ్లో లేని శ్రేయస్ అయ్యర్ను సెలక్టర్లు పక్కన బెట్టారు. సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్లు జట్టులోకి వచ్చారు.
భారత జట్టు : రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్