టీ20 వరల్డ్కప్ నుంచి విరాట్ కోహ్లీ ఔట్.. కారణం ఏంటంటే?

Byline :  Bharath
Update: 2023-12-02 05:58 GMT

విరాట్ కోహ్లీకి బీసీసీఐ మరోసారి మొండిచేయి చూపించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఫామ్ అందుకుని కంబ్యాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆసీయా కప్, వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచి.. జట్టుకు వెన్నుముకలా మారాడు. ఫైనల్ ఓటమితో కాస్త డిప్రెషన్ లో ఉన్న విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ తో పాటు, సౌతాఫ్రికా టూర్ లో జరిగే వన్డే సిరీస్, టీ20 సిరీస్ లకు రెస్ట్ ఇచ్చింది. తిరిగి టెస్ట్ సిరీస్ లో కోహ్లీ జట్టులో జాయిన్ అవుతాడు. గత వరల్డ్ కప్ నుంచి టీ20లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ తిరిగి టీ20 ఫార్మట్ లో ఎంట్రీ ఇవ్వడం అనుమానంగా ఉంది. తిరిగి టీ20ల్లో ఆడతారు అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు.

తాజాగా 2024లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఉండనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ క్రమంలో జట్టులో కోహ్లీకి చోటు కష్టమని తెలిపింది. రోహిత్ సారథ్యంలో మొత్తం కుర్రాళ్లతో కూడిన జట్టును టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుందట. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలక్టర్లు ఈ విషయమై చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్ లాంటి ట్యాలెంటె కుర్రాళ్లకు కోహ్లీ వల్ల అవకాశాలు దక్కడం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అందుకే కోహ్లీని సైలెంట్ గా టీ20ల నుంచి తప్పించేందుకు సిద్దం అయ్యారు. ఈ విషయమై బీసీసీఐ అధికారులు కోహ్లీతో మాట్లాడనున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News