ద్రవిడ్కు బీసీసీఐ ఆఫర్.. ఓకే చెప్తే?

By :  Bharath
Update: 2023-11-29 06:20 GMT

టీమిండియా హెడ్ కోచ్గా దాదాపు రెండేళ్లపాటు జట్టును నడిపించిన రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం తాజా వరల్డ్ కప్ తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ద్రవిడ్ కోచ్ గా కొనసాగుతాడా? రిటైర్ అవుతాడా అనే విషయంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన కోచ్ గా కొనసాగేందుకు ఆసక్తిగా లేడని బీసీసీఐ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ద్రవిడ్ సరేనంటే.. అతని పదవి కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. కానీ ద్రవిడే వ్యక్తిగతంగా నో చెప్తుండటంతో బీసీసీఐ సందిగ్ధంలో పడింది. ద్రవిడ్ స్థానంలో ప్రస్తుతం స్టాడ్ బై కోచ్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లక్ష్మణ్ విన్ పర్సంటేజ్ గొప్పగా ఉంది. అతని కోచింగ్ లో జట్టు ఎన్నో సిరీస్ లు సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ లో టీమిండియా గోల్డ్ సొంతం చేసుకుంది. లక్ష్మణ్ మార్గదర్శకంలోనే ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ నడుస్తుంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ (ఎన్సీఏ) అకాడమీ చీఫ్‌గానూ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ చర్చలు కూడా బలంగానే నడుస్తుండగా.. మరో వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.

ద్రావిడ్ ను మరికొన్ని రోజులు హెడ్ కోచ్ గా కొనసాగాలని బీసీసీఐ పెద్దలు కోరారు. కొద్ది కాలంలోనే టీ20 వలర్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. ఈ టైంలో ద్రవిడ్ కోచ్ గా తప్పుకుంటే జట్టు కూర్పు దెబ్బతింటుంది. అందుకే ద్రవిడ్ ను కోచ్ గా కొనసాగాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం. దీనిపై ద్రవిడ్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ అతడు ఓకే చెప్తే డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించే టీమిండియా జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తారు. కొందరేమే కోచ్ గా కొనసాగేందుకు ద్రవిడ్ విముఖత చూపుతున్నాడని, ఏదైనా ఐపీఎల్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి.

ద్రవిడ్‌ కోచ్‌గా సీనియర్‌ జట్టును పర్యవేక్షించగా.. జూనియర్లు అధికంగా ఉన్న జట్టుతో లక్ష్మణ్‌ పలు పర్యటనలకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ ముంగిట ద్రవిడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆ టోర్నీలో ఫెయిల్ అయినప్పటికీ.. ద్రవిడ్ శిక్షణలో భారత్ ఎన్నో ద్వైపాక్షక సిరీస్ లో గెలిచింది. చాలామంది యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం దక్కింది. అతని నేతృత్వంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ తో పాటు.. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు కూడా చేరింది. అయితే దురదుష్టవశాత్తు కప్పు గెలవలేకపోయాం. గతేడాది టీ20 వరల్డ్ కప్ లో సెమీస్, ఆసియా కప్ లో విజయం అన్నీ ద్రవిడ్ కోచింగ్ లోనే జరిగాయి. ముందు చాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో ద్రవిడ్ కే కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని అంతా ఆశిస్తున్నారు. ప్రధాన టోర్నీ ముందు కోచ్ మారితే జట్టుకే ఇబ్బందని అంటున్నారు. ఈ క్రమంలో ద్రవిడ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News