BCCI : కుర్రాళ్లకు బీసీసీఐ వార్నింగ్.. ఆడతారా..? లేక!

Byline :  Bharath
Update: 2024-02-12 11:46 GMT

టీమిండియా కుర్రాళ్లు పూర్తిగా మారిపోయారు. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి.. పూర్తిగా కమర్షియల్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వారిపై సీరియస్ అయింది. ఐపీఎల్ సీజన్ రాకముందు ఏ క్రికెటర్ అయినా దేశవాళీలో ఆడేవారు. అక్కడ టాలెంట్ రుజువు చేసుకుని జాతీయ జట్టులో సెలక్ట్ అయ్యేవారు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైనవారు కూడా అంతే. దేశవాళీలో శ్రమించేవారు. అయితే ఐపీఎల్ వచ్చాక క్రికెట్ పూర్తిగా మారిపోయింది. దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోవడం మానేశారు. షార్ట్ కట్ గా ఐపీఎల్ లో నిరూపించుకుంటే.. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. దీనిపై బీసీసీఐ దృష్టిపెట్టింది. జాతీయ జట్టులో సెలక్ట్ కాకుండా.. ఐపీఎల్ సన్నాహాల్లో బిజీ అయినవారికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది.

రంజీల్లో ఆడకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. జాతీయ జట్టు సభ్యులు, గాయాల బారిన ఆటగాళ్లు మినహా అందరూ రంజీల్లో పాల్గొనాలని బీసీసీఐ పిలుపునిచ్చింది. బీసీసీఐ పిలుపును పట్టించుకోని వారికి త్వరలో నోటీసులు అందుతాయని తెలిపింది. నోటీసులు అందుకున్న వారిపై తీవ్ర చర్యలు ఉండనున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల జాతీయ జట్టునుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్.. దానిపై దృష్టిపెట్టకుండా ఐపీఎల్ సన్నాహాల్లో బిజీ అయిపోయాడు. తన స్వత దేశవాళీ జట్టుకు దూరంగా ఉండి.. బరోడాలో ఏర్పాటుచేసిన ట్రైనింగ్ క్యాంపులో పాల్గొంటున్నాడు. హార్దిక్, కృనాల్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. జాతీయ జట్టులోకి రావాలంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని కోచ్ ద్రవిడ్ సూచించినా ఇషాన్ కిషన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్ పై సిరియస్ గా ఉంది. 

Tags:    

Similar News