World Cup 2023: హైదరాబాద్లో.. పాక్ ప్లేయర్ల ఫుడ్ కష్టాలు.. ముక్క లేదంటూ

By :  Bharath
Update: 2023-09-30 03:24 GMT

వరల్డ్ కప్ కోసం భారత్ కు వచ్చిన జట్లకు.. స్వాగత సత్కారాలు, అతిథి మర్యాదలు ఘనంగా జరిగాయి. ఇక ఫుడ్ గురించి చెప్పక్కర్లేదు. భారతీయ వంటకాలతో మన చెఫ్ లు, విదేశీ ఆటగాళ్ల పొట్టలు నింపుతున్నారు. వాళ్లు అడిగింది వండిపెడుతూ.. మన వాళ్ల చేతి రుచి చూపిస్తున్నారు. ఇక వరల్డ్ కప్ కోసం హైదరాబాద్ కు వచ్చిన పాక్ జట్టుకు మంచి ఆదరణ లభించింది. బంజారహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో పాకిస్తాన్ జట్టు బస చేస్తుంది. ఈ క్రమంలో వాళ్లకు వడ్డించిన ఫుడ్ మెనూ బయటికి వచ్చింది. అందులో చికెట్, మటన్, ఫిష్ వెరైటీలన్నీ ఉన్నాయి. కానీ ఒకటి తక్కువైందని పాక్ ప్లేయర్లు నిరుత్సాహపడ్డారు.

పాక్ ఆటగాళ్లంతా బీఫ్ ఎక్కువగా తింటారు. వాళ్ల డైట్ లో అది మెయిన్ కోర్స్. అయితే మన దేశంలో మాత్రం ఏ జట్టుకు బీఫ్ వడ్డించరు. ఇదొక్కటే వాళ్ల ఫుడ్ మెనూలో మిస్ అయింది. దీంతో పాక్ ఆటగాళ్లంతా ప్రొటీన్ కోసం చికెన్, మటన్, ఫిష్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్ల కోసం చెఫ్ ను ఉడికించిన బాస్మతీ బియ్యం, స్పఘెట్టి బోలోగ్నీస్ సాస్, వెజిటేబుల్ పులావ్ వండమని అడిగారట. కాగా, వార్మప్ మ్యాచ్ లతో పాటు, పాక్ ప్రధాన మ్యాచ్ లన్నీ ఉప్పల్ స్టేడియంలోనే ఉండటంతో.. పాక్ జట్టు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటుంది.

Tags:    

Similar News