క్రికెట్కు భువనేశ్వర్ రిటైర్మెంట్..ఇన్స్టాలో ఇండికేషన్..!

By :  Kalyan
Update: 2023-07-28 12:19 GMT

ఇండియన్ పేసర్ భువనేశ్వర్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇవ్వనున్నారా.. ఇన్స్టాగ్రామ్లో అతడి బయో చూసిన నెటిజన్స్ ఇది నిజమే అంటున్నారు. గత కొంతకాలంగా భువీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గాయాలకు తోడు ఫామ్ లేక వరుస టోర్నీల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో అతడిని బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ను నుంచి తొలగించింది. ఈ క్రమంలో అతడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2012లో భువీ టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టీంలో కీలక బౌలర్గా ఎదిగాడు. అయితే కొంతకాలంగా ఫామ్ లేక సతమతమవుతున్నాడు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఈ సమయంలోనే తన ఇన్స్టా బయోను భువీ ఛేంజ్ చేశాడు. ఇప్పటివరకు అతడి బయోలో ఇండియన్ క్రికెటర్ అని ఉండగా.. ఇప్పుడు ఇండియన్ అని ఉంది. దీంతో భువీ రిటైర్మెంట్ అవుతున్నాడనే ప్రచారం మొదలైంది.

భువీ ఇండియా తరుపున 117 వన్డేలు, 21 టెస్టులు, 48 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు. అటు దేశవాలీ క్రికెట్కు సైతం భువీ దూరంగా ఉన్నాడు. చివరిసారిగా 2022 జనవరిలో భారత్ తరుపున అతడు వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత నుంచి మళ్లీ జట్టులో ఆడలేదు. జీవితంలో ఎత్తు పల్లాలు కామన్ అని.. ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని ఫ్యాన్స్ భువీకి సూచిస్తున్నారు. అతడి ఇన్స్టాగ్రామ్ బయోలను షేర్ చేస్తున్నారు.


Tags:    

Similar News