టీమిండియాలో నో ప్లేస్.. 8 వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చిన భువనేశ్వర్

By :  Bharath
Update: 2024-01-13 14:07 GMT

ఒకప్పుడు టీమిండియాలో ప్రధాన బౌలర్ గా కొనసాగిన భువనేశ్వర్ కుమార్.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి భారత జట్టులో చోటు కోల్పోయాడు. భువీ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి దాదాపు ఐదేళ్లైంది. టెస్టులతో పాటు.. టీ20, వన్డే ఫార్మట్ లోనూ భువీ జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు భువీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రీఎంట్రీ ఇచ్చిన భువీ.. ఉత్తర్ ప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. శనివారం (జనవరి 13) బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఈ మ్యాచ్ లో 22 ఓవర్లు వేసిన భువీ.. 41 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి.

భువీ దాటికి బెంగాల్ 188 పరుగులకే ఆలౌట్ అయింది. షమీ తమ్ముడు మహమ్మద్ కైఫ్ 45 పరుగులతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో కైఫ్ 4/14, సూరజ్‌ సింధు జైస్వాల్ 3/20, ఇషాన్‌ పొరెల్ 2/24 బంతితో విజృంభించడంతో ఉత్తర్ ప్రదేశ్ 60 పరుగులకే కుప్పకూలింది. తర్వాత భువీ విజృంభించడంతో బెంగాల్ రెండో ఇన్నింగ్స్ లో 188 పరుగులకే ఆలౌట్ అయింది.


Tags:    

Similar News