IRE vs IND: తొలి ఓవర్లోనే రెండు వికెట్లు.. కమ్బ్యాక్ అంటే ఇది
డబ్లిన్ లోని ది విలేజ్ వేదికపై ఐర్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ హీరోకు తుది జట్టులో అవకాశం కల్పించింది టీమిండియా. దాదాపు ఏడాది తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన కెప్టెన్ బుమ్రాపైనే అందరి చూపు ఉండగా.. దాన్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికి ఫోర్ ఇచ్చిన బుమ్రా మొదట భారత అభిమానుల్ని భయపెట్టాడు. తర్వాత బంతికే ఐర్లాండ్ ఓపెనర్ బల్బిర్నేని క్లీన్ బౌల్డ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత రెండు బంతుల్ని డాట్ చేసి.. ఐదో బంతికి టక్కర్ ను పెవిలియన్ చేర్చాడు.
దీంతో మొదటి ఓవర్లోనే ఐర్లాండ్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దాంతో ఐదు ఓవర్లలో ఐర్లాండ్ 23/2 వికెట్లతో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు వర్షం కురిసే అవకాశం ఉందని
సూచనలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం అంతా మారిపోయి మ్యాచ్ స్టార్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తుది జట్లు:
ఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పాల్ స్టిర్లింగ్(c), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(w), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(c), రవి బిష్ణోయ్