IND vs PAK : ‘మ్యాచ్ కన్నా నా తల్లే ముఖ్యం.. అందుకే..!’ ఇంటికి బయల్దేరిన బుమ్రా

By :  Bharath
Update: 2023-10-12 11:41 GMT

ప్రపంచం ఎదురుచూసే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ మరోకు ఇంకా ఒక రోజే టైం ఉంది. అహ్మదాబాద్ వేదికపై దాదాపు 1,32,000 మంది ప్రేక్షకుల మధ్యలో దయాదుల పోరు జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. రెండు టీంలు వరుసగా రెండు విజయాలతో ప్రపంచకప్ లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం హాట్రిక్ విజయంపై కన్నేశాయి. బుమ్రాకు ఇది సొంత మైదానం కాగా.. మ్యాచ్ లో అతను కీలకంగా మారతాడని అంతా ఆశిస్తున్నారు. ఈ క్రమంలో భారత స్టార్ పేస్ బౌలర్ బుమ్రా ప్రాక్టీస్ కు దూరం అయ్యాడు. మ్యాచ్ కంటే ముందు తన తల్లికే తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చాడు.

చాలాకాలంగా తన తల్లికి దూరంగా ఉన్న బుమ్రా.. అహ్మదాబాద్ కు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్ట్ లో దిగగానే నేరుగా ఇంటికి బయలుదేరాడు. తర్వాత టీంతో జాయిన అయి.. ప్రాక్టీస్ లో పాల్గొంటాడు. ‘సొంత మైదానానికి రావడం ఆనందంగా ఉంది. మ్యాచ్ కంటే ముందు అమ్మను చూసేందుకు వెళ్తున్నా. అదే నేను ఇవ్వాల్సిన తొలి ప్రాధాన్యం. ఇకపోతే సొంత మైదానం అయినా నాకు ఈ పిచ్ కొత్తే. నేను ఇక్కడ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. టెస్టులు, టీ20 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చిన అభిమానులను నిరాశ పరుచను. అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తా’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఐదేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న బుమ్రాను తల్లి దల్జీత్ పెంచి.. క్రికెటర్ గా తీర్చిదిద్దింది.

Tags:    

Similar News