జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న యార్కర్ కింగ్.. ఏ సిరీస్లో ఆడనున్నాడంటే..?

Update: 2023-06-24 15:45 GMT

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త ఇది. వెన్ను నొప్పి కారణంగా గతేడాది సెప్టెంబర్ లో క్రికెట్ కు దూరంగా ఉన్న యార్కర్ కింగ్ జస్ప్రిత్ బుమ్రా ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. బుమ్రాతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యార్ కూడా రీ ఎంట్రీ ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో భారత అభిమానుల్లో హుషారు మొదలయింది. క్రికెట్ లో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ పొంగిపోతున్నారుజ ఇదంతా జరిగితే.. అక్టోబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా మరింత బలంగా బరిలోకి దిగుతుంది.

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా అగస్ట్ 18 నుంచి టీ20 సిరీస్ జరుగుతుంది. ఆ సిరీస్ లోనే బుమ్రా, అయ్యర్ రీ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ సిరీస్ ద్వారా బుమ్రా ఫిట్ నెస్ పై కొంత అవగాహనకు రావొచ్చని తెలుస్తోంది. అందులో రాణిస్తే.. తర్వాత నెలల్లో జరగబోయే ఆసియా కప్, ప్రపంచ కప్ లో బుమ్రాను జట్టులోకి తీసుకుంటారు. బుమ్రా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో వీవీఎస్ లక్ష్మణ్, నితిన్ పటేల్ పర్యవేక్షణలో ఉన్నాడు.

Tags:    

Similar News