రెచ్చిపోయిన బుమ్రా.. కల్లుచెదిరే యార్కర్కు ఎగిరిపడ్డ వికెట్లు (వీడియో)

Byline :  Bharath
Update: 2024-02-03 10:26 GMT

తక్కువ కాలంలోనే ప్రపంచ మేటి పేస్ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు జస్ప్రిత్ బుమ్రా. అతని వెరైటీ బౌలింగ్ యాక్షన్ సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. యార్కర్ కింగ్ గా పేరు తెచ్చుకున్న బుమ్రా.. తాను డిసైడ్ అయి యార్కర్ వేస్తే ఏ టాప్ బ్యాట్స్ మెన్ అయినా ఔట్ అవ్వాల్సిందే. గాయం నుంచి కోలుకుని సుధీర్ఘ విరామం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా నుంచి ఎక్కువగా యార్కలు కనిపించలేదు. జట్టును భుజాన మోస్తూ.. వికెట్లు పడగొడుతున్నా.. బుమ్రా మార్క్ యార్కర్ల కోసం అంతా వెయిట్ చేశారు. ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఓ కల్లు చెదిరే యార్కర్ తో.. తిరిగి పాత బుమ్రాను గుర్తుచేశాడు.

వైజాగ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బౌలింగ్ చేసిన బుమ్రా.. మొదటి టెస్ట్ మ్యాచ్ హీరో ఓలీ పోప్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బుమ్రా యార్కర్ ను అడ్డుకునేందుకు పోప్ విశ్వ ప్రయత్నం చేసినా.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుల్లెట్ వేగంతో వచ్చిన యార్కర్ కు చేతులెత్తేశాడు. యార్కర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించి బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. అంతకుముందు జో రూట్ (5) వికెట్ తీసి ఇంగ్లాండ్ ను కోలుకోని దెబ్బకొట్టాడు. కాగా పోప్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Tags:    

Similar News