Virat Kohli birthday: స్టేడియంలో బర్త్డే సెలబ్రేషన్స్.. కోహ్లీకి ప్రత్యేక మెమంటో

Byline :  Bharath
Update: 2023-11-05 04:46 GMT

ప్రపంచకప్లో సెమీస్కు ముందు టీమిండియా మరో భారీ మ్యాచ్ ఆడనుంది. అందులో మ్యాచ్ జరిగేది కింగ్ కోహ్లీ బర్త్ డే రోజునే. ఇక సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అతని పోస్టులతో సోషల్ మీడియా బద్దలవుతుంది. ప్రత్యేక రీల్స్, పోస్టర్లు చేసి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. నిన్నటినుంచే ట్విట్టర్ లో ‘#HappyBirthdayViratKohli’ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. కాగా ఇవాళ జరిగే మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవలే పాక్ క్రికెటర్ హారిస్ రౌఫ్ కూడా అదే విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు. కాగా బర్త్ డే సందర్భంగా మ్యాచ్ కు ముందు బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) కోహ్లీకి మెమొంటో అందివ్వనుంది. దాంతో పాటు ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ కట్ చేయిస్తుంది. పుట్టినరోజు గుర్తుండి పోయేలా మ్యాచ్ ముగిసిన తర్వాత లైట్ షో ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో కోహ్లీ బొమ్మను తయారుచేశాడు. ఒడిస్సాలోని పూరీ బీచ్ లో సాండ్ ఆర్ట్ ను ప్రదర్శించాడు.

https://x.com/sudarsansand/status/1721002760508956947?s=20

Tags:    

Similar News