ICC World Cup 2023 రౌండ్ టేబుల్ మీటింగ్లో కునుకు తీసిన కెప్టెన్

Byline :  Bharath
Update: 2023-10-04 14:13 GMT

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన్డే వరల్డ్ కప్ కు అంతా రెడీ అయింది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా టోర్నీ రేపటినుంచి (అక్టోబర్ 5) ప్రారంభం కానుంది. కాగా టోర్నీ ప్రారంభానికి ముందు అహ్మదాబాద్ లో కెప్టెన్సీ డేను నిర్వహించింది ఐసీసీ. వరల్డ్ కప్ లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కెప్టెన్లు సమాధానాలు ఇచ్చారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. భారత్ లో ఉంటే తమ దేశంలో ఉన్నట్లుందని చెప్పుకొచ్చాడు. తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబల్ హసన్ మాట్లాడుతున్న టైంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.




 


సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కాసేపు కునుకు తీశాడు. అతను నిద్రపోతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బవుమా నిద్రపోతుంటే.. పక్కనే ఉన్న విలియమ్సన్ తనను చూస్తూ ఉండిపోయాడు. దానికి కాస్త సరదాను జోడించిన మీమర్స్.. నీ పనే బాగుంది మీటింగ్ కు వచ్చి నిద్ర పోతున్నావ్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు. భారత్ కు వచ్చిన బవుమా.. మొదటి వార్మప్ మ్యాచ్ లు ఆడి.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో సౌతాఫ్రికా బయలుదేరాడు. ఇక ఈరోజే సౌతాఫ్రికా నుంచి వచ్చిన బవుమా.. నేరుగా మీటింగ్ కు అటెండ్ అయ్యాడు. జర్నీ వల్ల అలసిపోయిన బవునా సందు దొరకగానే స్టేజ్ పై నిద్రపోయాడు.




 








Tags:    

Similar News