NZ vs AFG: పసికూనల పని పడుతూ.. టేబుల్ టాప్లోకి

Byline :  Bharath
Update: 2023-10-18 16:20 GMT

వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో భారీ విజయాలను నమోదుచేసింది. ఇవాళ చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి.. టేబుల్ టాప్ కు దూసుకుపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 రన్స్ చేసింది. పిచ్.. స్పిన్‌కు అనుకూలించినా.. ఆఫ్ఘన్ స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్ డెవాన్ కాన్వే (20) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (54) రాణించాడు. రచిన్‌ రవీంద్ర (32)తో కలిసి కివీస్‌ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. తర్వాత వీరిద్దరూ వెనుదిరిగినా.. టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71) జోడి నిలకడగా ఆడుతూ ఆఫ్ఘన్ ముందు భారీ స్కోర్ ఉంచింది. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.




 


289 పరుగుల లక్ష్య చేదనలో ఆఫ్ఘన్ కేవలం 34.4 ఓవర్లకే కుప్పకూలింది. కివీస్ బౌలింగ్ ముందు మోకరిల్లి 139 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్ 149 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. రహ్మత్ షా (36) జట్టులో టాప్ స్కోరర్. ఓపెనర్లు రహ్మానుల్లా (11), ఇబ్రహిమ్ (14) విఫలం అయ్యారు. అహ్మతుల్లా (27), ఇక్రమ్ (19) పరుగులకే పెవిలియన్ చేరారు. చివర్లో నవీన్ ఉల్ హక్, ఫరూకీ డకౌట్ అయ్యారు. బౌల్ట్ 2 వికెట్లు, హెన్రీ 1, రచిన్ 1, ఫెర్గుసన్, సాంటర్న్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు.




Tags:    

Similar News