ఐపీఎల్ 2024 ఫీవర్ అప్పుడే మొదలయింది. ఇప్పటికే పలు ఫ్రాంచేజీలు జట్టులో కీలక మార్పులు తీసుకునేందుకు నిర్ణయించుకోగా.. మెగా ఆక్షన్ లో ఏ జట్టు ఏ ఆటగాడిని దక్కించుకుంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్ లో మెగా ఆక్షన్ ఉంటుందని, ప్రతీ ఫ్రాంచేజీ రూ.100 కోట్లు వినియోగించుకోవచ్చని బీసీసీఐ పర్మిషన్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మరోవార్త.. ఐపీఎల్ అభిమానుల్ని కలవరపెడుతోంది.
ఐపీఎల్ దాదాపు ఏప్రిల్ -మే నెలలోనే జరుగుతుంది. అదే సమయంలో దేశంలో లోక్ సభ ఎలక్షన్స్ జరుగనున్నాయి. దీంతో దేశంలో సెక్యూరిటీ విషయంలో ఐపీఎల్ ను నిర్వహించలేకపోవచ్చు. ఈ లెక్కన మే మొదటి వారంలోనే ఐపీఎల్ పూర్తి చేయాలి. అంతేకాకుండా విదేశీ ఆటగాళ్లు, బోర్డు సభ్యులకు వేరే తేదీలు సమ్మతం అవునో కాదో తెలుసుకోవాలి. లేదంటే ఇదివరకటి లాగానే ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించే అవకాశం కూడా ఉంది. 2009 ఎన్నికల టైంలో కూడా ఎలక్షన్స్ వచ్చాయి. దాంతో బీసీసీఐ ఐపీఎల్ ను సౌతాఫ్రికాలో నిర్వహించింది. 2014లో కూడా కొన్ని మ్యాచ్ లు విదేశాల్లో, కొన్ని మ్యాచ్ లు భారత్ లో నిర్వహించింది. అయితే ఈ నిర్ణయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Due to election, BCCI has involved in organizing the IPL abroad
BCCI, IPL2024, elections, loksabha elections, latest news, sports news, cricket news