Glenn Maxwell : ఫుల్లుగా మందు కొట్టి ఆస్పత్రిపాలైన మ్యాక్స్ వెల్.. విచారణకు ఆదేశం
గ్లెన్ మ్యాక్స్వెల్.. ఎంత విధ్వంసక ఆటగాడో అందరికీ తెలిసిందే.. ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగలడు. వరల్డ్ కప్లో ఆప్గనిస్తాన్తో జరిగిన ఓటమి అంచున తన జట్టును డబుల్ సెంచరీ చేసి గెలిపించాడు. తాజాగా ఈ ఆటగాడు ఫుల్లుగా మందుగా కొట్టి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మ్యాక్స్ వెల్ ఓ లేట్ పార్టీకి హాజరై ఫుల్లుగా తాగాడు. మందు ఎక్కువ అవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన తన సహచర ఆటగాళ్లు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన వైద్యులు.. డిశ్చార్జ్ చేశారు. అయితే ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసీస్.. వెస్టిండీస్తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్ ఆడుతోంది. రేపటి నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే టెస్టు, వన్డే జట్టుకు మ్యాక్సీని ఎంపిక చేయలేదు. కానీ ఫిబ్రవరి 9నుంచి జరిగే టీ20 మ్యాచులకు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ విధ్వంసకర ఆటగాడు ఆస్పత్రిపాలు కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ జరుపుతోంది.